ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఇటీవలే తాను ఇండిగో విమానంలో ప్రయాణించగా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తనపట్ల సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు. సిబ్బంది తనతో ఎంతో దురుసుగా వ్యవహరించారని మంచు లక్ష్మి తెలిపారు. తన లగేజీ బ్యాగ్‌ను పక్కకు తోసేసినట్లు చెప్పారు. బ్యాగ్ ఓపెన్ చెయ్యడానికి కూడా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. సిబ్బంది అయిన మేము చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్‌ను గోవాలోనే వదిలేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదోరకమైన వేధింపులు అంటూ ఫైర్ అయ్యారు. ఈ విధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు.? అంటూ నిలదీశారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పర్సు మర్చిపోవడంతో ఇండిగో సిబ్బందిని సాయం అడగ్గా.. వారు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- January 27, 2025
0
29
Less than a minute
Tags:
You can share this post!
editor