హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాలీవుడ్ సింగర్ జనై భోస్లే డేటింగ్‌లో ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముంబయిలో జనై భోస్లే 23వ జన్మదిన వేడుకల్లో సిరాజ్ పాల్గొనడం.. వేడుకల ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆ ఫొటోల్లో సిరాజ్, జనై సన్నిహితంగా ఉండడంతో ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూసింది. పలువురు యూజర్లు సైతం ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇక ఈ వార్తలపై సిరాజ్ స్పందించాడు. రిలేషన్‌షిప్ వార్తలను ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు. తనకు జనై భోస్లే సోదరిలాంటిదని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. జనై లాంటి ఇష్టమైన సోదరి తనకు లేరని.. ఆమె లేకుండా తాను ఉండాలనుకోనని అంతా అన్నాచెల్లెళ్ల బంధం అని పేర్కొన్నాడు. నక్షత్ర సమూహంలో చంద్రుడు ఉన్నట్లుగా.. ఆమె వెయ్యి మందిలో ఒకరు అంటూ సిరాజ్ స్పందించాడు. మరోవైపు జనై సైతం స్పందించింది. సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడంటూ డేటింగ్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. జనై భోస్లే బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోంస్లే మనుమనరాలు. జనై సైతం ప్రస్తుతం సింగర్‌గా కొనసాగుతోంది. త్వరలోనే బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

- January 27, 2025
0
27
Less than a minute
Tags:
You can share this post!
editor