తండేల్ రాజుగా నేను మారడంలో ఈ టీమ్ కృషి చాలా ఉంది. శ్రీకాకుళం వెళ్లి ఈ కథకు ప్రేరణనిచ్చిన వ్యక్తుల్ని కలుసుకుని, వారినుండి ఎన్నో విషయాలు తెలుసుకుని కష్టపడి, ఇష్టంతో ఈ సినిమాకి పనిచేశాం. అద్భుతమైన టీమ్‌తో పనిచేసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని అక్కినేని నాగచైతన్య అన్నారు. ఆయన, సాయిపల్లవి జంటగా నటించిన భావోద్వేగ ప్రేమకావ్యం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాగచైతన్య మాట్లాడారు. అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ ‘ట్రైలర్, టీజర్ ఏది చూసినా అద్భుతం అనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైతూ, సాయిపల్లవి కెమిస్ట్రీ పండింది. ఈ సినిమా ఓ అద్భుతమైన అనుభవమని, అరవింద్ తనను సొంత కూతురిలా చూసుకున్నారని, చైతూ గొప్ప కోస్టార్ అని సాయిపల్లవి చెప్పారు.

- February 3, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor