బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఇబ్రహీం ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే ఇబ్రహీం అలీఖాన్ ఓటీటీ డెబ్యూ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్, ఓటీటీ స్ట్రీమింగ్ వేదికను రివీల్ చేశారు మేకర్స్. ఇబ్రహీం అలీఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా నదానియన్. ఈ సినిమాలో శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్ కథానాయికగా నటిస్తోంది. షాన గౌతమ్ దర్శకత్వం వహిస్తుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోనేం మిశ్రా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా త్వరలోనే ప్రీమియర్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. ఈ సినిమా యూత్‌ఫుల్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

- February 1, 2025
0
30
Less than a minute
Tags:
You can share this post!
editor