రాజేంద్ర ప్రసాద్‌పై వార్నర్ ఫ్యాన్స్ సీరియస్..!

రాజేంద్ర ప్రసాద్‌పై వార్నర్ ఫ్యాన్స్ సీరియస్..!

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. మార్చి 28, 2025 న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పైగా ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. అయితే, రాబిన్‌హుడ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌‌పై నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ, ఆయన ఏం అన్నారంటే.. మా వెంకీ, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్‌ను తీసుకొచ్చారు. ఆయన క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్స్ వేశాడు. మామూలోడు కాదండీ వీడు. రేయ్ వార్నరూ.. అని రాజేంద్రప్రసాద్ నవ్వుతూ అందర్నీ నవ్వించడానికి మాట్లాడారు. అయితే, రాజేంద్రప్రసాద్ సరదాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడటమేంటని వార్నర్ ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా రాబిన్ హుడ్ పై భారీ బజ్ ఉంది. మొత్తానికి ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి వస్తున్న ప్రమోషన్స్ సహా కంటెంట్ మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇంతకీ, ఈ సినిమా ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

editor

Related Articles