తమిళ హీరో సూర్య – వెంకీ అట్లూరి కలయికలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నెల నుండి వెంకీ అట్లూరి సినిమాకు సూర్య డేట్స్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్‌గా మేకర్స్ మొదట భాగ్యశ్రీ భోర్సేను తీసుకునే ప్లాన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ ప్లేస్‌లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోందట. బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాలో ఊర్వశి రౌతేలాకి మంచి పాత్ర దక్కింది. ఆమె పాత్రలో గ్లామర్‌తో పాటు యాక్షన్ కూడా బాగానే హైలైట్ అయింది. ‘సితార’ బ్యానర్‌లోనే ‘డాకు మహారాజ్’ వచ్చింది. ఇప్పుడు ఇదే బ్యానర్‌లో రాబోతున్న సూర్య సినిమాలో కూడా ఊర్వశి రౌతేలాకి మరో బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందించబోతున్నాడు.

- March 24, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor