కల్యాణ్‌రామ్ నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలని ముందు భావించారు. కానీ రానున్న వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని ఓ పదిహేను రోజులు ముందుగానే అంటే.. ఈ నెల 18న సినిమాను విడుదల చేస్తున్నట్టు గురువారం ఓ ప్రకటన ద్వారా నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో కల్యాణ్‌రామ్ మాస్, యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. క్యారెక్టర్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా ఈ పోస్టర్ ఉంది. విజయశాంతి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ముఖ్యపాత్రధారులు. ఈ సినిమాకి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్.

- April 4, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor