‘కింగ్‌డమ్’కి తారక్ విషయంలో విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

‘కింగ్‌డమ్’కి తారక్ విషయంలో విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సినిమా ‘కింగ్‌డమ్’ గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఇలా రీసెంట్‌గా వచ్చిన టైటిల్ టీజర్‌తో అంచనాలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకున్నాయి. మరి ఈ టీజర్‌కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఏ రేంజ్‌లో క్లిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మరి ఈ వాయిస్ ఓవర్‌పై విజయ్ నుండి పలు ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. తాము టీజర్‌కి వాయిస్ ఓవర్ డైలాగ్స్ అనుకున్నప్పుడు ఒక్క తారక్ అన్న తప్ప మరెవరూ న్యాయం చెయ్యలేరు అని డిసైడ్ అయ్యాము అని అలా అన్నని అడిగిన వెంటనే తాను ఒప్పుకొని చేద్దామని చెప్పారు. అంతే కాకుండా తారక్ డబ్బింగ్ చెప్పేటప్పుడు దానిని చాలాసార్లు ఇంప్రూవ్ చేస్తూ చెప్పాలని మరొక టేక్ మరొక టేక్ తీసుకునేవారని తనని ‘కింగ్‌డమ్’ ఆ రేంజ్‌లో ఎగ్జైట్ చేసిందని అన్న చెప్పారని అందుకే ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలిపారని విజయ్ రివీల్ చేశాడు. ఇందుకు గాను తారక్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తాను తెలిపాడు.

editor

Related Articles