కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంపౌండ్ నుండి వచ్చిన సినిమా మహారాజ. కురంగు బొమ్మై ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా వచ్చిన ఈ సినిమా జూన్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. మహారాజ 28 రోజుల థియాట్రికల్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా జులై 12న డిజిటల్ డెబ్యూ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. మహారాజ ఇక చైనీస్ భాషలో సందడి చేయనుంది. చైనాలో భారీస్థాయిలో విడుదలవుతూ అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకోబోతుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహారాజ నవంబర్ 29న చైనా వ్యాప్తంగా 40 వేలకు పైగా స్క్రీన్స్‌లలో విడుదల కానుంది.

- November 20, 2024
0
26
Less than a minute
Tags:
You can share this post!
administrator