తమిళనాడులో ఓ వైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తన పొలిటికల్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తూనే.. మరోవైపు అభిమానుల కోసం సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం 69వ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలుసుకదా. జన నాయగన్ (ప్రజల నాయకుడు) టైటిల్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు కార్తీ (ఖాకీ) ఫేం హెచ్.వినోద్ డైరెక్షన్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌కు రికార్డు స్థాయిలో ధర పలికిందని వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. తాజా కథనాల ప్రకారం జననాయగన్ ఓవర్సీస్ రైట్స్‌కు ఏకంగా రూ.75 కోట్లు పలికినట్టు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ కేవీఎన్ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.

- January 29, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor