అమ్మ రాజశేఖర్ డైరెక్షన్‌లో ఆయన కొడుకు రాగిన్ రాజ్ హీరోగా నటించిన సినిమా ‘తల’. పి.శ్రీనివాస్‌గౌడ్ నిర్మాత. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ట్రైలర్‌ను సోహైల్, అశ్విన్ విడుదల చేశారు. అమ్మను అమితంగా ప్రేమించే యువకుడి కథగా యాక్షన్ అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. రెండేళ్లు ఆలోచించి కొత్త పాయింట్‌తో ఈ కథ సిద్ధం చేశానని, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటుందని, రాగిన్ రాజ్ మంచి పర్‌ఫార్మెన్స్ కనబరిచాడని అన్నారు. హీరోగా తనకు శుభారంభాన్నిచ్చే సినిమా అవుతుందని హీరో అమ్మ రాగిన్ రాజ్ నమ్ముతున్నారు. అంకిత్ నస్కర్, రోహిత్, ఏస్తేర్, సత్యం రాజేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: ధర్మతేజ, అస్లాం కేఈ.

- January 29, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor