‘వేరే లెవెల్‌ ఆఫీస్‌’ కామెడీ సినిమా..

‘వేరే లెవెల్‌ ఆఫీస్‌’ కామెడీ సినిమా..

ఆర్జే కాజల్‌, అఖిల్‌ సార్థక్‌, శుభశ్రీ, మిర్చి కిరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘వేరే లెవెల్‌ ఆఫీస్‌’. ఇ.సత్తిబాబు దర్శకుడు. వరుణ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వరుణ్‌ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 12 నుండి ఈ సిరీస్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఇ.సత్తిబాబు సిరీస్‌ విశేషాలు తెలియజేస్తూ ‘తమిళంలో ‘వేరే మాదిరి ఆఫీస్‌’ వెబ్‌ సిరీస్‌కు మంచి పేరొచ్చింది. దానిని 50 శాతం మార్పులతో తెలుగులోకి తీసుకొచ్చాం. యువతతో పాటు కార్పొరేట్‌ ఉద్యోగులకు ఈ సిరీస్‌ బాగా కనెక్ట్‌ అవుతుంది’ అన్నారు. ఈ సిరీస్‌లో నటిస్తున్నప్పుడు 9 టూ 5 ఆఫీస్‌కు వెళ్లి వచ్చిన అనుభూతి కలిగిందని మిర్చి కిరణ్‌ చెప్పారు. ఈ కార్పొరేట్‌ ఆఫీస్‌ కామెడీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని ఆహా కంటెంట్‌ హెడ్‌ వాసు తెలిపారు. రీతూ చౌదరి, వసంతిక, మహేష్‌ విట్టా తదితరులు నటిస్తున్న ఈ సిరీస్‌కు సంగీతం: అజయ్‌ అరసాడ.

editor

Related Articles