సంక్రాంతికి రిలీజ్ కానున్న వెంకటేష్ సినిమా…

సంక్రాంతికి రిలీజ్ కానున్న వెంకటేష్ సినిమా…

హీరో వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఓ ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ 90 శాతం కంప్లీట్. తాజాగా సినిమా బృందం డబ్బింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా డబ్బింగ్‌ స్టూడియో నుండి ఓ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ వీడియో వేడుకను తలపించింది. వెంకటేష్‌, అతని భార్య పాత్ర పోషిస్తున్న ఐశ్వర్యరాజేశ్‌, వారి కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నారు. వెంకీ చరిష్మా, అనిల్‌ రావిపూడి హ్యూమర్‌ అంతా సరదాల మయం.. ఆడియన్స్‌కి ఓ గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని చూపెట్టనున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అని మేకర్స్‌ చెబుతున్నారు. ఇందులో వెంకీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి యాక్ట్ చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌, నరేష్, వీటీ గణేశ్‌, మురళీధర్‌గౌడ్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సమర్పణ: దిల్‌రాజు.

administrator

Related Articles