యూఐ ట్రైలర్‌.. ఉపేంద్రకి అమీర్‌ఖాన్‌ ఫుల్‌సపోర్ట్..

యూఐ ట్రైలర్‌.. ఉపేంద్రకి అమీర్‌ఖాన్‌ ఫుల్‌సపోర్ట్..

కన్నడ హీరో ఉపేంద్ర కాంపౌండ్ నుండి వస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘యూఐ’. ఉపేంద్ర కథనందిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నాడు. రీష్మా నానయ్య ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు ఉపేంద్ర. ఉపేంద్ర తలైవా టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న కూలీ చిత్రంలో కీ రోల్‌ చేస్తున్నాడని తెలిసిందే. ఉపేంద్ర జైపూర్ తాజా షెడ్యూల్‌లో అమీర్‌ఖాన్‌, తలైవా అండ్‌ టీంతో షూటింగ్‌లో పాల్గొన్నాడు. నేను ఉపేంద్రకి పెద్ద అభిమానిని. ఆయన సినిమా యూఐ డిసెంబర్ 20న విడుదలవుతుంది. హిందీ ప్రేక్షకులు కూడా నిన్ను చాలా ఇష్టపడతారు. ట్రైలర్‌ చూసి షాకయ్యా. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుంది.. అంటూ ఉపేంద్రను విష్‌ చేయగా.. ధన్యవాదాలు తెలియజేశాడు కన్నడ యాక్టర్. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మనోహరన్ – శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కాంతార ఫేమ్‌ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

editor

Related Articles