రీసెంట్‌గా మళయాళ సినిమా నుండి రిలీజ్‌కి వచ్చిన సాలిడ్ వైలెంట్ యాక్షన్ డ్రామా సినిమా “మార్కో” గురించి అందరికీ తెలిసిందే. మళయాళ సినిమా దగ్గర మాత్రమే కాకుండా తెలుగుతో సహా హిందీ మార్కెట్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో భయంకరమైన వైలెన్స్ పట్ల చాలానే కామెంట్స్ వచ్చాయి. టెక్నికల్‌గా నాచురాలిటీ పక్కన పెడితే దర్శకుడు హనీఫ్ అదేని చూపించిన వైలెన్స్ మాత్రం దారుణంగా ఉంది అనిపించింది. దీంతో చాలామంది ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినవారు ఉన్నారు అలాగే, తిట్టుకున్నవారు ఉన్నారు. అయితే రీసెంట్ గానే ఓటిటిలో రిలీజ్‌కి వచ్చిన ఈ సినిమా ఇపుడు టెలివిజన్ ప్రీమియర్ షోకి కూడా రావాల్సి ఉంది. కానీ సి బి ఎఫ్ సి(సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) వారు ఈ సినిమా టీవీ ప్రీమియర్ షోకి అడ్డు చెప్పినట్టు తెలుస్తోంది.

- March 5, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor