ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్‌గా హీరో మహేష్‌బాబుదే, అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం మహేష్‌బాబు తీవ్రంగా శ్రమిస్తుండగా జక్కన్న అండ్ కో ఈ సినిమాని పాన్ వరల్డ్ లెవెల్లో మన సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అయితే కొన్ని వారాల క్రితమే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా అప్పుడే లీక్‌కి గురైనట్టుగా పలు రూమర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో భారీ సెట్టింగ్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో కాశీ నగరం అన్నట్టుగా ఓ గ్రాండ్ సెట్ వర్క్ ఈ సినిమా నుండి ఇప్పుడు బయటకి వచ్చింది. అయితే ఇది డెఫినెట్‌గా మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ నుండే అని కన్ఫర్మ్‌గా టాక్ లేదు కానీ దాని నుండే అవ్వొచ్చు అని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియడం లేదు.

- March 5, 2025
0
41
Less than a minute
Tags:
You can share this post!
editor