రీసెంట్ గానే అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప 2 రికార్డులు మోత మోగించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించనున్న సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొనగా తన లైనప్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా కోలీవుడ్ దర్శకుడు అట్లీ కలయికలో రానున్న సినిమాలపై సాలిడ్ హైప్ నెలకొంది. అయితే నెమ్మదిగా ఇప్పుడు అట్లీ ప్రాజెక్ట్ ముందు ఉంటుంది అన్నట్టుగా గాలి మళ్లుతోంది కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఈ సాలిడ్ కాంబినేషన్‌పై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది అని తెలుస్తోంది. అట్లీ బన్నీ కోసం చాలా స్పెషల్‌గా ఈ సినిమాని డిజైన్ చేస్తున్నాడట. మొత్తానికి మాత్రం వీరి కలయికలో ఏదో పెద్ద గమ్మత్తు జరిగేలా ఉందని చెప్పాలి.

- March 5, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor