రానాతో బంధం.. త్రిష ఏమందంటే?

రానాతో బంధం.. త్రిష ఏమందంటే?

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్, నటుడు రానా దగ్గుబాటి మధ్య ఉన్న స్నేహంపై గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్రిష గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రానాతో తన అనుబంధంపై చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

త్రిష మాట్లాడుతూ.. తనకు, రానాకు దాదాపు 18 ఏళ్ల వయసు నుంచే పరిచయం ఉందని తెలిపారు. తాను చెన్నైలోని టి.నగర్‌లో ఉండేదాన్నని, ఎదురుగా నిర్మాత డి. రామానాయుడు కుటుంబం నివసించేదని చెప్పారు. రానా కూడా తన బాల్యంలో ఎక్కువ కాలం చెన్నైలోనే ఉండటంతో అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని వెల్లడించారు.

తమ బంధం గురించి త్రిష మాట్లాడుతూ.. “మా కథకు ముగింపు ఉండదు. కొన్నిసార్లు మంచి స్నేహితులుగా ఉంటాం. మరికొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడుకోం కూడా. మా రిలేషన్‌షిప్ లవ్-హేట్ బంధంలా ఉంటుంది” అని తెలిపారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒకరినొకరు పూర్తిగా దూరం చేసుకోలేని అనుబంధం తమదని చెప్పారు.

రానాను చాలామంది “లేడీస్ మ్యాన్” అని పిలుస్తారనే ప్రశ్నకు త్రిష నవ్వుతూ స్పందించారు. “అవును.. అతను లేడీస్ మ్యానే. అందులో సందేహం లేదు” అని పేర్కొన్నారు. అయితే రానాలో తనకు ఎక్కువగా నచ్చేది అతని వ్యక్తిత్వమని చెప్పారు.

పెద్ద సినీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ రానా ఎప్పుడూ గర్వంగా ప్రవర్తించడని, అందరితో మర్యాదగా, గౌరవంగా ఉంటాడని త్రిష కొనియాడారు. గొడవలు జరిగినా, మాట్లాడుకోకపోయినా అతని స్వభావంలో మార్పు ఉండదని చెప్పారు. రానా నిజమైన జెంటిల్‌మన్ అని, తనకు నచ్చిన విధంగా జీవించే వ్యక్తి అని ప్రశంసించారు. మొత్తంగా త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related Articles