మెగాస్టార్ చిరంజీవి మరో భారీ ప్రాజెక్ట్‌తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సక్సెస్ఫుల్ దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. విడుదలైన ఫస్ట్ ఫోటోలో చిరంజీవి పవర్‌ఫుల్‌గా, కొత్త షేడ్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. ‘వాల్తేర్ వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి బాబీ కొల్లి మెగాస్టార్ కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు సమాచారం.
చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధమవుతోందని టాక్. మాస్ ఎంటర్టైన్మెంట్తో పాటు హై ఆక్టేన్ యాక్షన్ అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి. త్వరలో ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలు ప్రకటించనున్నారు.

