మన టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇప్పుడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ప్రపంచమే ఎదురు చూస్తుండగా మహేష్ బాబు నుండి ఇప్పుడో క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. మహేష్‌కి హైదరాబాద్‌లో తన ఎఎంబి మాల్ అండ్ థియేటర్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందులో ఇప్పుడు ఆడియెన్స్ కోసం ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు ముందడుగు వేశారు. హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా కంప్లీట్ రాయల్‌గా లగ్జరీతో కూడిన స్పెషల్ స్క్రీన్స్‌తో కూడిన థియేటర్స్‌ని “MB LUXE” గా తన మాల్‌లో నిర్మించి ఇపుడు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఈ విజువల్స్ చూసి అంతా ఓ రేంజ్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీంతో మహేష్ అభిమానులు తనకి బెస్ట్ విషెస్‌ని కూడా తెలియజేస్తున్నారు.

- February 8, 2025
0
23
Less than a minute
Tags:
You can share this post!
editor