పవన్‌ కళ్యాణ్‌తో స్టెప్పులు వేసిన టాలీవుడ్ భామలు వీళ్లే..!

పవన్‌ కళ్యాణ్‌తో స్టెప్పులు వేసిన టాలీవుడ్ భామలు వీళ్లే..!

టాలీవుడ్ యాక్టర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న సినిమా హరిహరవీరమల్లు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుంది. హరిహరవీరమల్లు పార్ట్‌ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఇప్పటికే మాట వినాలి బీటీఎస్ వీడియో రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌లో పవన్‌ కళ్యాణ్‌తో పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్‌ డ్యాన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అనసూయ ఓ టీవీ రియాలిటీ షోలో చెప్పేసింది. అంతేకాదు ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌కు అదిరిపోయే పాటలు కంపోజ్‌ చేసిన గణేశ్ మాస్టర్‌ మరోసారి ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయబోతున్నాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందని సమాచారం. మొత్తానికి జ్యోతికృష్ణ ల్యాండ్‌ మార్క్‌గా నిలిచిపోయేలా ప్లాన్ చేశాడని అర్థమవుతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

editor

Related Articles