నిజంగా పుష్ప ఒక స్మగ్లర్ పేరు అదే ‘పుష్ప’ టైటిల్‌!

నిజంగా పుష్ప ఒక స్మగ్లర్ పేరు అదే ‘పుష్ప’ టైటిల్‌!

‘పుష్ప’ ఫ్రాంఛైజీ సినిమాలు రెండూ భారతీయ బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలు దేశవ్యాప్తంగా రికార్డులను తిరగరాశాయి. పుష్పరాజ్‌ పాత్ర మాస్‌ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్‌ అయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో హీరోకి పుష్ప అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయం గురించి దర్శకుడు సుకుమార్‌ ఆసక్తికరమైన వివరాల్ని వెల్లడించారు. తమిళనాడులో జరిగిన ఓ ఈవెంట్‌లో సుకుమార్‌ మాట్లాడారు. ‘పుష్ప’ సినిమాలోని హీరో పుష్పరాజ్‌ పాత్రను నిజమైన గంధపు చెక్కల స్మగ్లర్‌ నుండి స్ఫూర్తిపొంది రూపొందించినట్లు చెప్పారు. ‘ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఓ వెబ్‌సిరీస్‌ తీద్దామనుకొని పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ను కలిశా. నాకెందుకో ఆ పేరు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దాంతో అతన్ని ఇంటర్వ్యూ చేశాను. అదే పేరుతో సినిమా తీస్తే బాగుంటుందనిపించింది. సాధారణంగా ‘పుష్ప’ అనే పేరు మహిళలకు ఉంటుంది.. కానీ ఓ స్మగ్లర్‌ అలాంటి పేరు పెట్టుకోవడం నన్ను ఆకర్షించింది అని సుకుమార్‌ తెలిపారు.

editor

Related Articles