గడిచిన కాలం తిరిగి రమ్మన్నా రాదు..

గడిచిన కాలం తిరిగి రమ్మన్నా రాదు..

‘సోషల్‌ మీడియాతో జాగ్రత్త. అందులో చూసే ప్రతిదాన్నీ నమ్మొద్దు. ఒకవేళ నమ్మితే.. మీ మనసుల్లోకి అనవసరమైన చెత్త వచ్చి చేరుతుంది. అందుకే తెలివిగా ముందడుగేయండి. సమయం చాలా విలువైంది. గడచిన కాలం తిరిగి రమ్మన్నా రాదు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.’ అంటూ హితవు పలికారు తమిళ అగ్రనటుడు విజయ్‌ సేతుపతి. ఇటీవల ఓ కాలేజీ ఈవెంట్‌లో విద్యార్థులతో మాట్లాడారాయన. ఈ సందర్భంగా అజిత్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘గతంలో అజిత్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. అజిత్‌ గొప్ప నటుడు, మంచి వ్యక్తి. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోను. ఇప్పటికైతే అలాంటి ఆఫర్‌ నాకు రాలేదు. నా కెరీర్‌లో ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. అన్నీ అనుకోకుండానే వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు విజయ్‌ సేతుపతి.

editor

Related Articles