గత ఏడాది బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టింది కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. ఆ పెళ్లిలో అతిథులు ఫోన్‌లు వెంట తీసుకురావొద్దనే ఆంక్షలు విధించారు. ఈ విషయమై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది రకుల్‌ప్రీత్‌సింగ్. పెళ్లి వేడుకను అందరూ ఆనందంగా ఆస్వాదించాలనే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి ఫొటోలు అతిథుల ద్వారా బయటకు వస్తాయనే భయంతో ఫోన్‌లు నిరాకరించామని మీడియాలో వార్తలొచ్చాయి.ఆ వార్తలో వాస్తవం లేదు. వివాహ వేడుక చాలా సింపుల్‌గా జరపాలనుకున్నాం. కొద్దిపాటి మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాం. నా దృష్టిలో విలాసం కంటే సౌకర్యం చాలా ప్రధానం. పెళ్లి తాలూకు మధుర క్షణాలను అతిథులు కూడా పరిపూర్ణంగా ఆస్వాదించాలని నో ఫోన్ పాలసీ పెట్టాం. పెళ్లి తర్వాత మేమే ఫొటోలను మీడియాకు విడుదల చేశాం’ అని చెప్పుకొచ్చింది. రకుల్‌ప్రీత్‌సింగ్ తాజా చిత్రం ‘మేరే హజ్‌బెండ్ కీ బీవీ’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.

- February 20, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor