సకుటుంబంగా చూడదగ్గ సినిమాలు నిర్మించడంలో శివలెంక కృష్ణప్రసాద్, రూపొందించడంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సిద్ధహస్తులు. ఈ కారణం చేతే.. వీరిద్దరి కలయికలో వస్తున్న ‘సారంగపాణి జాతకం’ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రియదర్శి, రూప కొడవాయూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ‘కుటుంబ సమేతంగా చూడదగ్గ పరిపూర్ణ హాస్యరస సినిమా మా ‘సారంగపాణి జాతకం’. అందుకే వేసవి సెలవల్లో విడుదల చేస్తున్నాం. ప్రచార సినిమాల్లో సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో ఇప్పటికే పరిచయం చేశాం. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్ తుదిదశకు చేరుకుంది. నరేష్ వీకే, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్.

- February 24, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor