సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఆర్టిస్ట్’. రతన్ రిషి దర్శకుడు. జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాత. త్వరలోనే సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా శనివారం ఈ సినిమాలోని పాటను నిర్మాతలు విడుదల చేశారు. ‘ఓ ప్రేమ.. ప్రేమ.. ’ అంటూ సాగే ఈ గీతాన్ని రాంబాబు గోసాల రాయగా, సురేష్ బొబ్బిలి స్వరపరిచారు. రమ్య బెహర ఆలపించారు. ‘జారే కన్నీరే అడుగుతుందా.. నేరం ఏముందో చెప్పమంటూ.. నా ప్రేమ ఇలా ఓ ప్రశ్నయ్యేనా.. నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా’ అంటూ విషాద ప్రేమను ఆవిష్కరిస్తూ ఎమోషనల్‌గా ఈ పాట సాగింది. తనికెళ్ల భరణి, సత్యం రాజేష్, ప్రభాకర్, వినయ్ శర్మ, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: చందూ ఏజే.

- February 24, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor