కొత్తగా తెలుగు ఫీల్డ్‌కి వచ్చా, కొత్త భాష అనగానే కాస్త కంగారు పడ్డా. నిదానంగా అలవాటు పడ్డా. కొత్త నగరంలో కొత్త సంస్కృతిని ఆకళింపు చేసుకున్నా. ముఖ్యంగా తెలుగు భాషపై ఇష్టం, ఆసక్తి రెండూ పెరిగాయి. ఆ పదాలు పలికే విధానం, శబ్ధం నాకు నచ్చాయి’ అంటోంది కేరళ కుట్టి మాళవిక మోహనన్. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ గురించి ఆమె మాట్లాడింది. అందులో తన పాత్ర గురించీ, అనుభవాల గురించి ఆసక్తికరంగా వెల్లడించింది. ది రాజాసాబ్ హర్రర్ కామెడీ సినిమా. ఇప్పటివరకూ నేను చేయని జోనర్. ఇందులో ఆద్యంతం నా పాత్ర బలమైనదే. అద్భుతమైన సన్నివేశాల్లో నటించాను. ‘బాహుబలి’ నుండి ప్రభాస్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో కలిసి పనిచేయాలని కలలు కన్నా. సెట్‌లో ఆయన్ను చూసి ఆశ్చర్యపోయా. అంతపెద్ద హీరో నార్మల్‌గా ఉంటారు. సపోర్టివ్‌గా కూడా ఉంటారు. ఆయన ఉన్న ప్రదేశాన్నంతా కంఫర్టబుల్‌గా మార్చేస్తారు. మనతో సరదాగా గడుపుతారు. సెట్‌లో ఉన్న టీమ్ మొత్తానికీ మంచి ఫుడ్‌ని పంపిస్తారు. దగ్గరుండి బిర్యాని తినిపిస్తారు.. కామెడీ టైమింగ్‌తో నవ్విస్తారు. నిజంగా ప్రభాస్ చాలా స్వీట్.’ అంటూ తెగ పొగిడేసింది మాళవిక మోహనన్.

- February 24, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor