ఆడిన మాట తప్పక చేపల పులుసు రుచి చూపించిన హీరో..

ఆడిన మాట తప్పక చేపల పులుసు రుచి చూపించిన హీరో..

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య  నటిస్తోన్న సినిమా తండేల్‌. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ సినిమాకి చందూ మొండేటి డైరెక్షన్‌ చేస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. తాజాగా నాగచైతన్య షూటింగ్ లొకేషన్‌లో చేపల పులుసు వండిన వీడియోను షేర్ చేశారు మేకర్స్. అన్నా ఇంతకుముందు నాగచైతన్యను కలిసినప్పుడు మా అంత బాగా ఆయన కూడా చేపల పులుసు వండుతానని ప్రామిస్ చేశాడు. ఆ మాటెంతవరకు నిజం చేస్తాడో చూట్టానికి మేం వెళ్లాం. అచ్చం మాలాగే కట్టెల పొయ్యిపై రుచికరమైన చేపల పులుసు వండాడంటూ ఓ స్థానిక వ్యక్తి సంభాషణలతో సాగుతుంది వీడియో. షూటింగ్‌ టైంలో చైతూ వండిన చేపల పులుసు తిన్న స్థానికులు సూపర్‌గా ఉందంటూ మార్కులు ఇచ్చారు. ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. బన్నీవాసు నిర్మిస్తున్నారు. నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువగానే ఉన్నాయి.

editor

Related Articles