డైరెక్టర్‌ హరీష్‌శంకర్‌ కథకు ఓకే చెప్పిన హీరో?

డైరెక్టర్‌ హరీష్‌శంకర్‌ కథకు ఓకే చెప్పిన హీరో?

ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ కోసం కథ రాస్తున్నానని దర్శకుడు హరీష్‌శంకర్‌ చెప్పారు. అయితే.. అది జరిగి చాలా కాలమైంది. బాలయ్య తన సినిమాలతో బిజీగా ఉంటున్నారు. హరీష్‌శంకర్‌ కూడా తన ప్రాజెక్టులతో బిజీ. మరి బాలకృష్ణ కథ ఎందాక వచ్చింది? అనేది మాత్రం మొన్నటిదాకా ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే.. ఇన్‌సైడ్‌ వర్గాల సమాచారం మేరకు బాలకృష్ణ కథను హరీష్‌శంకర్‌ సిద్ధం చేశారట. బాలయ్యకు వినిపించడం, అది ఆయనకు నచ్చడం కూడా జరిగిపోయిందట. ప్రస్తుతం హీరో యష్‌తో ‘టాక్సిక్‌’ సినిమాని తెరకెక్కిస్తున్న ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాని నిర్మించనుంది. హరీష్‌శంకర్‌కు రీమేక్‌ డైరెక్టర్‌ అనే ముద్ర ఉంది. ఆ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంగా ఈసారి బాలయ్యకోసం ఓ కొత్త కథను సిద్ధం చేశారట హరీష్‌శంకర్‌. బాలయ్య చరిష్మాకు, హరీష్‌ టైమింగ్‌ తోడైతే హిట్‌ పక్కా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

editor

Related Articles