దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి మూడో తరం రాబోతోంది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటనలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. గౌతమ్ తాజాగా న్యూయార్క్ కాలేజీలో మైమ్ ప్రదర్శన చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మకమైన NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో తన నటనా ప్రతిభతో ఉర్రూతలూగించాడు. ఇటీవల అతను తన సహ విద్యార్థులతో కలిసి ఒక మైమ్ ప్రదర్శనలో పాల్గొన్నాడు, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గౌతమ్.. ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ వెలుతురులో డిన్నర్ చేస్తున్నట్లు కనిపించాడు. తొలుత నవ్వుతూ, తర్వాత కోప్పడుతూ ఎమోషన్స్ బాగానే పలికిస్తున్నట్లు కనిపించాడు. ఇక ఇందులో గౌతమ్ చేసిన నటన అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గౌతమ్ తన సహచరులతో కలిసి నటిస్తూ, మాటలు లేకుండానే తన హావభావాలను అద్భుతంగా పలికిస్తూ యాక్టింగ్ చేశాడు. ఇక ఈ వీడియోను సెరాఫీనా జేరోమి తెరకెక్కించగా.. కాశ్వీ రమణి, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

- March 21, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor