‘విశ్వంభ‌ర’ ఫ‌స్ట్ సింగిల్‌ ఏప్రిల్ 12న విడుద‌ల..

‘విశ్వంభ‌ర’ ఫ‌స్ట్ సింగిల్‌ ఏప్రిల్ 12న విడుద‌ల..

టాలీవుడ్ నుండి వ‌స్తున్న సినిమాలలో విశ్వంభ‌ర  ఒక‌టి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినిమా ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే గ‌త ఏడాది ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి కీల‌క అప్‌డేట్‌ను వెల్ల‌డించారు నిర్మాతలు. ఈ సినిమా నుండి ఫ‌స్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. రామ రామ  అంటూ ఈ ఫ‌స్ట్ సింగిల్ రాబోతుండగా.. ఈ సంద‌ర్భంగా బాల హ‌నుమాన్‌ల‌తో చిరంజీవి ఉన్న కొత్త పోస్ట‌ర్‌ను షేర్ చేసింది. మ‌రోవైపు ఈ సినిమా విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరోయిన్ త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles