‘అఖండ 2’ పై జరుగుతున్న పుకార్లలో నిజం లేదు..!

‘అఖండ 2’ పై జరుగుతున్న పుకార్లలో నిజం లేదు..!

బాలకృష్ణ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ సినిమా అఖండ 2 గురించి అందరికీ తెలిసిందే. బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అలా వచ్చిన అఖండ అయితే అన్నిటినీ మించి రికార్డులను సెట్ చేసింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 శరవేగంగా జరుగుతోంది. అయితే దీనిపై కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. బాలయ్యకి, బోయపాటికి పడట్లేదు అని షూటింగ్ అంత సజావుగా జరగట్లేదు అంటూ కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మొత్తం షూట్ అనుకున్నట్టే జరుగుతోంది. సో ఆ మాటల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

editor

Related Articles