టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే సంచలనం రేపిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో షాలిని పాండే ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా హైలెట్ అయిన షాలిని పాండే ఆ తర్వాత మళ్లీ అలాంటి హిట్ అందుకోలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో అటు హీరో విజయ్ దేవరకొండ ఇటు షాలిని పాండే ఇద్దరూ కూడా కావల్సినంత కంటెంట్ ఇచ్చారు. అప్పటికీ షాలిని పాండే తెలుగు ఆడియెన్స్‌కి అంతగా పరిచయం లేదు. కాని అర్జున్ రెడ్డిలో ప్రీతి అనే పాత్రతో మాత్రం అందరినీ ఆకట్టుకుంది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. డబ్బా కార్టెల్ ప్రమోషన్స్‌లో భాగంగా షాలినీ పాండే మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో నేను సౌత్ సినిమా చేశాను. ఆ సమయంలో డైరెక్టర్ ప్రవర్తన వలన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కారవాన్‌లో నేను డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో నా అనుమతి లేకుండానే అతడు డోర్ తీశాడు. నాకు కోపం వచ్చి వెంటనే ఆయనపై కేకలు వేయడం స్టార్ట్ చేశాను.. అప్పుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు.

- March 22, 2025
0
29
Less than a minute
Tags:
You can share this post!
editor