ఐశ్వ‌ర్య‌రాయ్ కాల్ చేస్తే భయం వేస్తుంది అంటున్న అభిషేక్

ఐశ్వ‌ర్య‌రాయ్ కాల్ చేస్తే భయం వేస్తుంది అంటున్న అభిషేక్

అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టించిన ఐ వాంట్ టూ టాక్ సినిమాకి గాను ఆయ‌న‌కి ఉత్త‌మ న‌టుడి అవార్డ్ ద‌క్కింది. ఈ అవ‌కాశం ఇచ్చిన సినిమా బృందానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ ద‌ర్శ‌కుడి వ‌ల్లే త‌న‌కి ఈ అవార్డ్ వ‌చ్చింద‌ని అన్నారు. అనంత‌రం తోటి నటుడు, షో హోస్ట్ అర్జున్ క‌పూర్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించారు అభిషేక్ బ‌చ్చ‌న్. అర్జున్ క‌పూర్ మాట్లాడుతూ.. నేను మీతో మాట్లాడాలి అంటూ ఎవ‌రు ఫోన్ చేస్తే మీకు కంగారు వ‌స్తుంద‌ని అభిషేక్‌ని ప్ర‌శ్నించాడు. నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబ‌ట్టి ఇలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతున్నావు. ఒక‌సారి పెళ్లైతే ఈ ప్ర‌శ్న‌కి నీ ద‌గ్గ‌ర కూడా ఓ స‌మాధానం ఉంటుంది. భార్య ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అంటే కంగారు ప‌డ‌తాం, ఆ ఫోన్ కాల్స్ మ‌న‌ల్ని ఒత్తిడికి గురిచేస్తాయి అంటూ స‌ర‌దాగా కామెంట్ చేశారు అభిషేక్. అభిషేక్ బ‌చ్చ‌న్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

editor

Related Articles