రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఇదే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 27న రామ్‌చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ ప్రకటన, టీజర్ రిలీజ్ ఉంటాయని సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’కు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో రామ్‌చరణ్ అభిమానులు ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాల్ని పెట్టుకున్నారు.

- March 22, 2025
0
44
Less than a minute
Tags:
You can share this post!
editor