దివంగత నటి సిల్క్ స్మితకు టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐటెమ్ సాంగ్స్‌తో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ఆమె తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా సిల్క్ స్మితను పోలి ఉన్న ఓ యువతి జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె రూపం, హావభావాలు సిల్క్ స్మితను గుర్తు చేస్తున్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పూర్తిగా పోలిక లేకపోయినా, కొంతవరకు సిల్క్‌ను తలపిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారింది. సిల్క్ స్మిత అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటూ పలు కామెంట్లు పెడుతుండగా, మరికొందరు ఆ యువతి రూపాన్ని ప్రశంసిస్తున్నారు.

