4వ రోజు కూడా ‘తండేల్’‌కు కలెక్షన్ల పంటే…

4వ రోజు కూడా ‘తండేల్’‌కు కలెక్షన్ల పంటే…

అక్కినేని నాగచైతన్య నటించిన సినిమా ‘తండేల్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ లవ్ స్టోరీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇక ప్రేక్షకులు అందించిన రెస్పాన్స్‌కు సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో సోమవారం రోజున ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కీలకమైన సోమవారం టెస్ట్‌లో కూడా ‘తండేల్’ పాస్ అయ్యింది. దీనికి బుక్ మై షో లో టికెట్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. సోమవారం రోజు ఈ సినిమాకి బుక్ మై షోలో ఏకంగా 73 వేలకు పైగా టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ తెలిపారు. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమాకు సోమవారం కూడా సాలిడ్ వసూళ్లు రావడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

editor

Related Articles