‘మాట వినాలి’ అంటూ సింగర్‌కు ఛాన్స్ ఇవ్వని పవన్ కళ్యాణ్..?

‘మాట వినాలి’ అంటూ సింగర్‌కు ఛాన్స్ ఇవ్వని పవన్ కళ్యాణ్..?

హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ సినిమా ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుండి వచ్చిన ‘మాట వినాలి’ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటను పవన్ స్వయంగా పాడారు. అయితే, ఈ పాటకు లిరిక్స్ రాసిన ప్రముఖ సింగర్ పెంచల్ దాస్, తొలుత తానే ఈ పాటను పాడాలని అనుకున్నారట. అయితే, పవన్ కళ్యాణ్‌కు ఈ పాట నచ్చడంతో ఆయనే స్వయంగా పాడతానని చెప్పారట. దీంతో ‘మాట వినాలి’ అంటూ పవన్ పాడిన పాట మన ముందుకు రావడం.. అది చార్ట్‌బస్టర్‌గా మారడం జరిగిపోయింది. ఇక ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles