హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ సినిమాపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ ఏ ఈవెంట్‌కు వెళ్లినా అభిమానులు ‘ఓజీ.. ఓజీ’ అంటూ కేరింతలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎస్. థమన్ తాజాగా ఓ ఈవెంట్‌లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ గురించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్‌లో మాట్లాడిన థమన్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గతంలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, మిగిలిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ సెట్స్‌లో అడుగుపెట్టిన రోజున అభిమానులకు గిఫ్ట్‌గా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ ఒజాస్ అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.
- April 16, 2025
0
223
Less than a minute
Tags:
You can share this post!
administrator

