హీరో జూ. ఎన్టీఆర్ చాలా లగ్జరీ పర్సన్. ఆయన వేసుకునే బట్టలు, తిరిగే కారు, పెట్టుకునే వాచ్ అన్నీ కూడా చాలా కాస్ట్‌లీ. టాలీవుడ్ హీరోలలో ఎన్టీఆర్ ప్రతీ చిన్న వస్తువుకు భారీగా ఖర్చు పెడతారు. లగ్జరీ కార్లు, బట్టలు, షూస్, వాచ్, ఫోన్స్ ఇలా రకరకాల వస్తువుల కోసం కోట్లు ఖర్చుపెట్టడానికి ఏ మాత్రం వెనకాడరు ఎన్టీఆర్. ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్ కోసమే పది వేలు ఖర్చు పెట్టారంటే కార్ల కోసం, దుస్తుల కోసం ఏ రేంజ్‌లో ఖర్చు పెడతారో అర్ధం చేసుకోవచ్చు. దుబాయ్‌లో చాలా సింపుల్‌గా కనిపించే నీలిరంగు పూల చొక్కా ధరించాడు ఎన్టీఆర్.. చూడ్డానికి ఆ షర్ట్ సింపుల్‌గానే కనిపిస్తున్నా ఆ షర్ట్ ధర తెలిసి షాకవుతున్నారు. ‘ఎట్రో’ అనే బ్రాండ్‌తో పిలవబడే ఈ చొక్కా ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా, దీని విలువ దాదాపుగా రూ.85 వేల వరకు ఉంటుందని అంచనా. ఒక్క చొక్కాకి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ కొనుగోలు చేశాడు కాని, ఏదేమైన ఎన్టీఆర్ రేంజే వేరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వాచ్‌ల కోసం కూడా కోట్లు ఖర్చు చేస్తుంటారు. గతంలో ఎన్టీఆర్ కలెక్షన్‌లో రెండు కోట్ల వాచ్‌ను పెట్టుకోవడం చూశాం. ఆ తర్వాత 7 కోట్ల 47 లక్షల రూపాయల వాచ్‌ని కూడా ధరించాడు. ఇక కార్లకి అయితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ గ్యారేజ్‌లో ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి.

- April 16, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor