హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన డిసీజ్‌తో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ డిసీజ్ లక్షణాలు ఎప్పుడు బయటపడ్డాయో వివరించింది. సమంత తాజాగా హిందీ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో మయోసైటిస్ గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఈ డిసీజ్ లక్షణాలు ఎప్పుడు బయటపడ్డాయో వివరించింది. సామ్ 2022లో బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ షోలోనే తనకు మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డట్లు చెప్పుకొచ్చింది.
‘అక్షయ్ కుమార్‌తో కలిసి నేను కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లా. నేను చాలా ప్రశాంతంగా ఉన్నానని.. కెరీర్‌పై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు షోలో కరణ్‌తో చెప్పా. ఆ షూటింగ్‌లో నాకు ఉన్నట్టుండి చాలా నీరసంగా అనిపించింది. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు వచ్చేశా. ఆ తర్వాతి రోజు ‘ఖుషీ’ సినిమా షూటింగ్ కోసం వెళ్లా. అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నా. దీన్నుంచి కోలుకునేందుకు ఇంకొంత సమయం పట్టొచ్చు’ అని సామ్ వివరించారు.