తాజాగా తెలుగు నటుడు పెనుమత్స సుబ్బరాజు సంతోష్ సైతం సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బీచ్‌లో తన భార్యతో కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో సుబ్బరాజు దంపతులు పెళ్లిబట్టల్లో కనిపించారు. కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, సుబ్బరాజు 47 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. వెన్నెల కిషోర్‌తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సుబ్బరాజు కృష్ణవంశీ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘ఖడ్గం’ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి ఆయన ఎంట్రీ కాస్త విచిత్రంగానే జరిగింది. కృష్ణవంశీ ఇంటికి కంప్యూటర్ రిపేర్ కోసం వెళ్లిన ఆయనకు అనుకోకుండా ‘ఖడ్గం’లో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలో నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కడంతో ఆ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించారు. సుబ్బరాజు స్వస్థలం ఏపీలోని భీమవరం.

- November 27, 2024
0
31
Less than a minute
You can share this post!
editor