టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా జాట్. బాలీవుడ్ హీరోగా సన్నీడియోల్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సినిమా లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. రెజీనా కసాండ్రా ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. అనల్ అరసు, రామ్-లక్ష్మణ్, నాగవెంకట్, పీటర్ హెయిన్స్ టీం జాట్ కోసం ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీన్లను రెడీ చేస్తుందని ఇన్‌సైడ్ టాక్. గోపీచంద్ మలినేని నుండి ఎలాంటి యాక్షన్ సినిమా వస్తుందో చెప్పేందుకు ఈ ఒక్క అప్‌డేట్ చాలు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

- January 21, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor