ఏ తండ్రికైన కొడుకుపైన మమకారం ఎక్కువే ఉంటుంది. కొడుకుకి ఏమైందని తెలిస్తే తండ్రి అల్లాడిపోతాడు. రామ్ చరణ్ విషయంలో చిరంజీవి కూడా ఓ సారి చాలా బాధని దిగమింగుకున్నాడట. మగధీర సినిమా సమయంలో చరణ్ కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటే చిరంజీవి కూడా ఎంతగానో భయపడ్డారంట. ఇదే కాక మెగా వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఆయనతో దర్శకుడు సుకుమార్ గిన్నెలు కడిగించాడట. రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ రంగస్థలం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫేస్‌లోనే విభిన్న భావోద్వేగాలను పలికించి వాహ్ అనిపించాడు. అప్పట్లో నాన్ `బాహుబలి` రికార్డులు బ్రేక్ చేసన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ అద్భుతమైన నటనతో అదరగొట్టాడు. సినిమాలో రామ్ చరణ్.. గిన్నెలు తోమడం, టాయిలెట్ తీసే సీన్లు ఉన్నాయి. అయితే ఆ సీన్స్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో చేత సుకుమార్ చేయించడంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. చిరంజీవి ఈ సీన్ చూసి..ఈ సీన్ నువ్వే చేసి చూపించావ్ కదా చరణ్‌కి అని అడిగితే, లేదు సార్, నేను ఏం చెప్పలేదు. చరణ్ ఆ పాత్రని ఓన్ చేసుకొని నటించాడని సుకుమార్ అన్నాడట. చిరు అస్సలు నమ్మలేదు. అయితే రామ్ చరణ్ వంట చేసి రుచి చూసే సీన్ కూడా సహజంగా చేశాడని సుకుమార్ అన్నాడట. దానికి చిరు సర్‌ప్రైజ్ అయ్యాడట.

- March 10, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor