Sub Jr.ఎన్టీఆర్‌ని  సినీ ఫీల్డ్‌కు పరిచయం చేసిన Jr. ఎన్టీఆర్

Sub Jr.ఎన్టీఆర్‌ని  సినీ ఫీల్డ్‌కు పరిచయం చేసిన Jr. ఎన్టీఆర్

నంద‌మూరి హ‌రికృష్ణ మ‌న‌వ‌డు, జాన‌కిరామ్ కుమారుడు తార‌క రామారావు హీరోగా వైవీఎస్ చౌద‌రి ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా వైవీఎస్ తార‌క రామారావు ఫ‌స్ట్‌లుక్ రివీల్ చేశారు. పవర్ ఫుల్ లుక్స్‌తో, బేస్ వాయిస్‌తో చూడగానే ఆకట్టుకునే లుక్‌లో దర్శనం ఇచ్చాడు నందమూరి నాలుగో తరం నటవారసుడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆల్‌ది బెస్ట్ చెబుతూ బాబాయ్‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ల‌తో పాటు ప‌లువురు ట్వీట్స్ చేశారు.

రామ్‌కు ఆల్‌ది బెస్ట్‌.. ఇది నీ మొద‌టి అడుగు. సినీ ప్ర‌పంచంలో నీకు లెక్క‌లేన‌న్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. నీకు అన్నీ విజ‌యాలే ద‌క్కాలి. మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, తాతగారు హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో ఎల్ల‌ప్పుడూ మీతోనే ఉంటాయి. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. నా ప్రియమైన రామ్‌కి శుభాకాంక్షలు. మీరు మీ తొలి సినిమాతో మా అందరినీ గర్వపడేలా చేస్తారని, మీ కెరీర్‌లో చాలా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. అని క‌ళ్యాణ్ రామ్ తెలిపారు.

administrator

Related Articles