బింబిసార తర్వాత కల్యాణ్‌రామ్ కాంపౌండ్ నుండి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ NKR21. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సోహైల్‌ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మేకర్స్ సోహైల్‌ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లుక్ ఒకటి విడుదల చేశారు. మేకర్స్ ఇప్పటికే NKR21 అనౌన్స్‌మెంట్ పోస్టర్ లాంచ్ చేశారని తెలిసిందే. ఇందులో పిడికిలి బిగించి ఉన్న కల్యాణ్‌రామ్ చేతిపై రక్తపు మరకలు చూడొచ్చు. ఈ సినిమాతో సోహైల్ ఖాన్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. ఇంతకీ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం మేకర్స్ ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెట్టారని ఇన్‌సైడ్ టాక్. బ్రహ్మ కడలి టీం వేసిన సెట్ డిజైన్‌లో ఫైట్ మాస్టర్ రామకృష్ణ నేతృత్వంలో కల్యాణ్ రామ్‌తోపాటు సుమారు 1,000 మంది ఆర్టిస్టులపై వచ్చే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగనుందట.

- December 20, 2024
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor