రొమాంటిక్‌ యాక్షన్‌ చేసిన కిరణ్‌ అబ్బవరం.. దిల్‌ రూబా

రొమాంటిక్‌ యాక్షన్‌ చేసిన కిరణ్‌ అబ్బవరం.. దిల్‌ రూబా

‘క’తో తొలి బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు హీరో కిరణ్‌ అబ్బవరం. ఆయన చేస్తున్న తాజా సినిమాకు ‘దిల్‌ రూబా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వ కరుణ్‌ దర్శకుడు. రవి, జోజో జోస్‌, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మాతలు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని గురువారం విడుదల చేశారు. హీరో పాత్రను ఆవిష్కరించేలా పోస్టర్‌పై ‘హిస్‌ లవ్‌.. హిస్‌ యాంగర్‌’ అనే కొటేషన్‌ను పొందుపరిచారు. ఇది రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ అని, కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో మరో మైలురాయిలా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: డానియెల్‌ విశ్వాస్‌, సంగీతం: సామ్‌ సీస్‌.

editor

Related Articles