‘పుష్ప-2’లోని ‘కిస్సిక్..’ పాటతో బాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకుంది ఈ అందాలభామ శ్రీలీల. నిర్మాతల కన్ను ఇప్పుడు ఈ తెలుగమ్మాయిపైనే ఉంది. ఇప్పటికే అక్కడ రెండు సినిమాలకు ఓకే చెప్పింది. తొందరలోనే మరో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ ఆఫీస్‌లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసి శ్రీలీల మీడియాకు కనిపించిందట. దాంతో వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే సినిమా రానున్నదని బీటౌన్ మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమా కూడా తెరకెక్కుతుందని, డైరెక్టర్, ఇతర వివరాలు తెలియాల్సివుంది.

- January 8, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor