‘పుష్ప 2’ నుండి శ్రీలీల ఐటమ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

‘పుష్ప 2’ నుండి శ్రీలీల ఐటమ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

రానున్న 12 రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పుష్ప 2 సినిమా సంద‌డి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా నుండి ట్రైల‌ర్‌తో పాటు పాట‌లు విడుద‌ల చేయ‌గా.. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఇదిలావుంటే సినిమా నుండి ఐటెం సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సినిమా బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కిస్సిక్ అంటూ ఈ సాంగ్ రాబోతుండ‌గా.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆ అంటే అమ‌లాపురం, రింగ రింగా, ఊ అంటావా మావ సాంగ్‌ల‌ను మించి ఈ పాట ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఫుల్ సాంగ్‌ను న‌వంబ‌ర్ 24న‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సినిమా యూనిట్ తెలిపింది.

editor

Related Articles