పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలకు యాక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు వీటిపై నెలకొనగా ఈ సినిమాల్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణతో చేస్తున్న “హరిహర వీరమల్లు” ఒకటి కాగా మరో సినిమా డైరెక్టర్ సుజిత్‌తో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “ఓజి”. అయితే వీటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఎప్పుడో స్టార్ట్ అయ్యిన ఈ సినిమాలు ఇంకా రిలీజ్‌కి నోచుకోవడం లేదు. ఇంకా ఓజి సినిమా కంటే ఎంతో ముందు స్టార్ట్ అయ్యిన వీరమల్లు సినిమా అయితే 2025 మార్చ్ రిలీజ్‌కి ఫిక్స్ చేశారు కానీ, మళ్లీ దీనిపై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కంటే భారీ సినిమా ఓజి ముందు వచ్చేస్తుంది అంటూ మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సిందే అని చెప్పాలి. మరి చూడాలి వీర ముందు వస్తాడా లేక ఓజాస్ గంభీర ముందు వస్తాడా అనేది..

- November 23, 2024
0
26
Less than a minute
You can share this post!
editor